- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakistan: భారత్ బాటలో పాక్.. విదేశాలకు ప్రతినిధి బృందాలు
పాకిస్థాన్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపనుంది. కాగా.. ఇలాంటి సమయంలో భారత్ బాటలోనే పాక్ వెళ్లనుంది. విదేశీలకు ప్రతినిధులను పంపేలా ఇదే రకమైన చర్యకు పాక్ పూనుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ ఉగ్రకుట్రలను ప్రపంచానికి తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపనుంది. కాగా.. ఇలాంటి సమయంలో భారత్ బాటలోనే పాక్ వెళ్లనుంది. విదేశీలకు ప్రతినిధులను పంపేలా ఇదే రకమైన చర్యకు పాక్ పూనుకుంది. భారత్ తమపై చేసిన దాడుల గురించి ప్రపంచానికి చెప్పేందుకు విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో (Bhutto-Zardari) నేతృత్వంలో ఓ బృందాన్ని పలు దేశాలకు పంపేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపాయి. ఈ విషయంపై ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడారు. భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై అమెరికా, యూకే, బెల్జియం, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలకు తమ వైఖరిని తెలియజేయడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతినిధి బృందంలో డిప్యూటీ విదేశాంగ శాఖ మాజీ మంత్రి హీనా రబ్బానీ ఖర్, రక్షణశాఖ మాజీ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్, విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ సభ్యులుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
భుట్టో ఏమన్నారంటే?
మరోవైపు, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. తమ బృందానికి నాయకత్వం వహించాలని తనను కోరినట్లు భుట్టో సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. "ప్రధానమంత్రి విదేశీ వేదికపై పాక్ వాదనను వినిపించాలని నన్ను సంప్రదించారు, అంతర్జాతీయ వేదికపై పాక్ శాంతి వాదనను ప్రదర్శించడానికి ఒక ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని ఆయన కోరారు. ఈ బాధ్యతను స్వీకరించడం, సవాలుతో కూడిన సమయాల్లో పాకిస్తాన్‌కు సేవ చేయడానికి కట్టుబడి ఉండటం నాకు గౌరవంగా ఉంది" అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగా సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాక్ తీరును ప్రపంచ దేశాల ముందు ఎండగట్టడానికి ఏడు బృందాలను ప్రపంచ దేశాలకు పంపిస్తున్నట్లు భారత ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్‌కుమార్ ఝా (జేడీ-యూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ-ఎస్పీ), శ్రీకాంత్ షిండే (శివసేన) ఈ బృందాలకు నేతృత్వం వహించనున్నట్లు తెలిపింది.






