- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
India vs New Zealand: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ బెట్టింగ్ లలో దావూద్ గ్యాంగ్!
ఐసీసీ చాంపియన్ ట్రోపీలో బెట్టింగ్ ల వ్యవహారం కలకలం రేపుతున్నది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీ 2025 ఫైనల్ సమరం మొదలైంది. భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ ను క్రికెట్ అభిమానులు వీక్షిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్ ల రూపంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయనే టాక్ కలకలం రేపుతున్నది. ఇవాళ దాదాపు రూ.5 వేల కోట్లు చేతులు మారబోతున్నట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన సెమీ ఫైనల్స్ సమయంలో బెట్టింగ్ లకు పాల్పడిన కొందరిని అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్ టాప్స్, మొబైల్స్ లైవ్ లో బెట్టింగ్ నిర్వహిస్తుండగా పట్టుబడ్డారు. వీరి దర్యాప్తులో షాకింగ్ విషయాలను అధికారులు గుర్తించారు. ఈ ముఠాకు అండర్ వరల్డ్ డాన్, ముంబయి పేలుల్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ -కంపెనీతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోపీలో దుబాయ్ వేదికగా పెద్ద ఎత్తున బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.






