- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ధురంధర్’పై దావూద్ గ్యాంగ్ ఆగ్రహం.. ముంబైలో భారీ ఉగ్ర కుట్రకు ‘డి-కంపెనీ’ ప్లాన్!
రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమాపై దావూద్ ఇబ్రహీం డీ-కంపెనీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే విడుదలైన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్ ‘ధురంధర్’ (Dhurandhar), ధురంధర్ ‘ది రివేంజ్’ మూవీలు అద్భత విజయాన్ని సాధించి రూ.కోట్లు కొల్లగొట్టి విషయం తెలిసిందే. అయితే, ఆ రెండు సినిమాలు అండర్ వరల్డ్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నట్లుగా తెలుస్తున్నట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాకిస్తాన్ నుంచి డీ-కంపెనీని నడిపిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఆ రెండు సినిమాల విడుదల తర్వాత ముంబైలో దావూద్ గ్యాంగ్ మళ్లీ యాక్టివ్ అయినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది.
దావూద్ పోలికలతో ఉన్న పాత్రే కారణమా..?
అయితే, ధురంధర్ మూవీలో ‘బడే సాహెబ్’ అనే పాత్రను చూపించారు. బెడ్‌పై చావు అంచున్న ఉన్న ఆ పాత్ర హావభావాలు, రూపం అచ్చం దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim)ను పోలి ఉండటమే డీ-కంపెనీ ఆగ్రహానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దావూద్ ఇంకా బతికే ఉన్నాడని, యాక్టివ్‌గా ఉన్నాడని ప్రపంచానికి నిరూపించుకోవాలనే తొందరలో ఈ గ్యాంగ్ ఉన్నట్లుగా సమాచారం. అండర్ వరల్డ్‌లో ఇంకా తమ పరపతి, మాఫియా పేరిట వసూళ్లు తగ్గిపోతుండటంతో ఉనికి చాటుకునేందుకు డీ-కంపెనీ తహతహలాడుతోందని జాతీయ మీడియా కోడై కూస్తోంది.
ISI సాయంతో ముంబైలో రిక్రూట్‌మెంట్..
ఈ క్రమంలోనే ముంబైలో సరికొత్త ఉగ్రకుట్రకు దావూద్ గ్యాంగ్ తెరలేపినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ముంబై వీధుల నుంచి కొంతమంది యువకులను ముఠాలోకి చేర్చుకునే బాధ్యతను చోటా షకీల్ గ్యాంగ్‌కు అప్పగించారని తెలుస్తోంది. బాంద్రా గరీబ్ నగర్‌లోని అక్రమ మసీదుపై మున్సిపల్ అధికారులు చేసిన బుల్డోజర్ చర్యలను చూపిస్తూ, యువకులను తప్పుదోవ పట్టించి గ్యాంగ్‌లోకి లాగుతున్నట్లుగా స్టేట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం గుర్తించాయి. ఈ కొత్త రిక్రూట్‌మెంట్లకు గాను పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) ఆయుధాలు సరఫరా చేస్తూ పక్కా ట్రైనింగ్ ఇస్తోందని, షూటర్ మున్నా జింగాడా నేతృత్వంలో భారత్‌లోని ఓ ప్రముఖ వ్యక్తిని టార్గెట్ చేయడానికి, భారీ ఉగ్ర దాడి చేసేందుకు స్కేచ్ వేస్తున్నట్లుగా సమాచారం. కాగా, ఇటీవలే ఢిల్లీ పోలీసులు సైతం ఈ ఐఎస్ఐ-అండర్‌వరల్డ్ నెట్‌వర్క్‌ను ఛేదించి పలువురిని అరెస్ట్ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.






