గుండె సంబంధిత వ్యాధులు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ : జేపీ నడ్డా

by Naga Rani Yarlagadda |

గుండె సంబంధిత వ్యాధులు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (అసంక్రమిత వ్యాధులు) లిస్టులోకి వస్తాయని

గుండె సంబంధిత వ్యాధులు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ : జేపీ నడ్డా
X

దిశ, వెబ్‌డెస్క్: గుండె సంబంధిత వ్యాధులు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (అసంక్రమిత వ్యాధులు) లిస్టులోకి వస్తాయని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. రాజ్యసభలో గుండెపోటు సంబంధిత కేసుల సమాచారంపై అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ నివారణ, నియంత్రణ కింద రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. దేశంలో గుండెపోటుకు సంబంధించిన కేసుల డేటాను కేంద్రప్రభుత్వం కేంద్రీకృతంగా నిర్వహించడం లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన అధ్యయనం ప్రకారం.. అక్యూట్ మయోకార్డియల్ ఇన్ ఫార్ క్షన్ (AMI) తో ఆస్పత్రిలో చేరడం ఇతర అనారోగ్య సమస్యలు, కుటుంబ చరిత్ర, ధూమపానంతో ముడిపడి ఉంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వివరించారు. గుండెపోటుకు దారితీస్తున్న కారణాలపై ఐసీఎంఆర్- నేషననల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ దేశవ్యాప్తంగా 25 ఆస్పత్రుల్లో అధ్యయనం చేశాయని పేర్కొన్నారు. 2021 అక్టోబర్ నంచి 2023 జనవరి మధ్యకాలంలో కొత్తగా నమోదైన AMI కేసులను పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తీవ్రమైన గుండెపోటు కేసులకోసం హబ్ అండ్ స్పోక్ విధానాన్ని అమలు చేస్తున్నామని మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

Next Story