- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sabarimala Temple: తీరిన అయ్యప్ప భక్తుల కోరిక.. శబరిమల దర్శనానికి కొత్త మార్గం
ఈ మార్పును మార్చి 15 నుంచి నెలవారీ పూజల సందర్భంగా అమలు చేస్తామని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు.

దిశ, నేషనల్ బ్యూరో: దీర్ఘకాలంగా శబరిమల భక్తుల నుంచి వినిపిస్తున్న డిమాండ్‌పై ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. అయ్యప్పస్వామి దర్శనం చేసుకునేందుకు వెళ్లే మార్గంలో మార్పులు చేయనున్నట్టు టీడీబీ అధికారికంగా ప్రకటించింది. భక్తుల సన్నిధానంలో పవిత్రమైన 18 మెట్లను ఎక్కిన వెంటనే నేరుగా స్వామిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. ఈ మార్పును ప్రయోగాత్మకంగా మార్చి 15 నుంచి నెలవారీ పూజల సందర్భంగా అమలు చేస్తామని, విషుపూజ సందర్భంగా 12 రోజుల పాటు కొనసాగిస్తామని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఇది విజయవంతమైతే వచ్చే మండలం-మకరవిళక్కు సీజన్‌లో దీన్ని శాశ్వతంగా అమలు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు 18 మెట్లు ఎక్కిన తర్వాత, వంతెన వైపుగా భక్తులను పంపించేవారు. ఆ క్యూలైన్‌లో పంపించడం ద్వారా కేవలం 5 సెకన్లు మాత్రమే అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ విధానంపై లక్షలాది మంది భక్తుల నుంచి దర్శనం సరిగా కలగలేదని, 18 మెట్ల తర్వాత దర్శనం కోసం మార్గాన్ని మార్చాలని కోరుతూ భక్తుల నుంచి లేఖలు అందాయి. బోర్డుకు నేరుగా అభ్యర్థనలు కూడా వచ్చాయని ప్రశాంత్ చెప్పారు.
అయ్యప్ప ఆలయ తంత్రి, ఇతర పండితుల నుంచి సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మార్పులు చేసిన తర్వాత కొత్త మార్గంలో అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు ఒక్కో భక్తుడికి సగటున 20-25 సెకన్ల సమయం పడుతుందన్నారు. ఇది కాకుండా, ఆలయ అభివృద్ధిలో అయ్యప్ప భక్తులను భాగస్వామ్యం చేసేందుకు, గ్లోబల్ అయ్యప్ప డివోటీస్ పేరుతో పంబాలో ప్రపంచ అయ్యప్ప భక్తుల సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి 150 మంది భక్తులు పాల్గొనే అవాశం ఉంది. మే నెలలో స్వామివారి మాసిక పూజలు మొదలవుతాయి. అదే నెలలో 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయని ప్రశాంత్ పేర్కొన్నారు.






