చైనా ల్యాబ్‌లో డేంజరస్ వైరస్ సృష్టి.. అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-09 05:34:22  IST  )

ఇప్పటికే కరోనా (Corona) వైరస్‌తో ప్రపంచాన్ని కకావికలం చేసిన చైనా (China).. ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది.

చైనా ల్యాబ్‌లో డేంజరస్ వైరస్ సృష్టి.. అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే కరోనా (Corona) వైరస్‌తో ప్రపంచాన్ని కకావికలం చేసిన చైనా (China).. ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ అమెరికాలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గోధుమ, బార్లీ, మొక్కజోన్న, వరి పంటలను సర్వనాశనం చేసేందుకు తాజాగా చైనా డేంజరస్ వైరస్‌ను సృష్టించింది. ‘ఫుసారియమ్ గ్రామినేరియ‌మ్’ (Fusarium Graminearum) అనే ఫంగస్‌ను ఇద్దరు చైనా శాస్త్రవేత్తలైన యున్కింగ్ జియాన్ (33), జున్యాంగ్ లియు (34) ల్యాబ్‌లలో అత్యంత గోప్యంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం వారు చైనాలోని పలు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

అయితే, వారు తాజాగా అమెరికా (America)లోని మిషిగన్ యూనివర్సిటీ (University of Michigan)లో పరిశోధనల కోసం ‘ఫుసారియమ్ గ్రామినేరియ‌మ్’ శిలీంద్రాలను తరలిస్తుండగా డెట్రాయిట్ మెట్రోపాలిటిన్ ఎయిర్‌పోర్టులో అనుమానం వచ్చిన ఎఫ్‌బీఐ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, విచారణ సందర్భంగా సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. చైనా కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party of China)కి సైంటిస్ట్ జియాన్ అత్యంత విధేయురాలని తెలిసింది. అదేవిధంగా ‘ఫుసారియమ్ గ్రామినేరియ‌మ్’ డెవలప్‌పై పని చేసిన జియాన్‌కు అదే కమ్యూనిస్ట్ పార్టీ నిధులను సమకూర్చినట్లుగా వెల్లడైంది. ఈ క్రమంలోనే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ (Kash Patel) సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా సంస్థల్లోకి చైనా తన సైంటిస్టులను అక్రమంగా పంపిస్తోందని ఫైర్ అయ్యారు. అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థను టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు చైనా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఫుసారియమ్ గ్రామినేరియ‌మ్ ఫంగస్‌ కారణంగా మానవులు, పశువులకు హాని కాలుగుతుందని, వరుసగా వాంతులతో పాటు కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుందంటున్న ఎఫ్‌బీఐ అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

Next Story