Rahul Gandhi: జై బీమ్, జైబాపు, జై సంవిధాన్ ర్యాలీలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |   (  Updated:2025-01-27 18:29:59  IST  )

బీజేపీ (BJP), ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) ల నుంచి కాంగ్రెస్‌ (Congress) రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు.

Rahul Gandhi: జై బీమ్, జైబాపు, జై సంవిధాన్ ర్యాలీలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ (BJP), ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) ల నుంచి కాంగ్రెస్‌ (Congress) రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశంలో స్వాతంత్ర్యం పూర్వం నాటి పరిస్థితులను కోరుకుంటున్నాయని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని (madhya pradesh) మహులో నిర్వహించిన జై బీమ్, జైబాపు, జై సంవిధాన్ ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మరోసారి బానిసలుగా మారుస్తున్నారని ఆరోపణలు చేశారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ రాజ్యాంగంపై దాడికి పాల్పడుతున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, పేదలను మరోసారి బానిసలుగా మారుస్తున్నాయి. రాజ్యాంగం మారిన రోజు ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

విద్యావ్యవస్థపై..

రాహుల్ దేశ విద్యా వ్యవస్థ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రైవేటు వ్యవస్థలో విద్య, వైద్య రంగాల యాజమాన్యం ఎవరి చేతిలో ఉంది..? మన దేశ విద్యా రంగం స్టాంపులు, సర్టిఫికేట్ల వ్యవస్థగా మారింది. సర్టిఫికేట్లు వస్తే.. ఉద్యోగాలు వస్తాయని కోట్లాది మంది ప్రజలు భావిస్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధం. అలా చేస్తే మీ పిల్లలు దేశంలో ఎలాంటి ఉపాధి పొందలేరు. ఈ బిలియనీర్లు దేశ ఉపాధి వ్యవస్థను నాశనం చేస్తున్నారు’’ అని ఆరోపించారు.

Next Story