తమిళనాడులో ద్వేషపూరిత వాతావరణంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఆందోళన

by Malleboina Mahesh |

తమిళనాడులోని ఒక ఎలక్ట్రిక్ రైల్లో ఒడిశాకు చెందిన వలస కార్మికుడిపై నలుగురు మైనర్లు కత్తితో దాడి చేసిన ఘటనపై సీపీఐ (CPI) ప్రధాన కార్యదర్శి డి. రాజా తీవ్రంగా స్పందించారు.

తమిళనాడులో ద్వేషపూరిత వాతావరణంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని ఒక ఎలక్ట్రిక్ రైల్లో ఒడిశాకు చెందిన వలస కార్మికుడిపై నలుగురు మైనర్లు కత్తితో దాడి చేసిన ఘటనపై సీపీఐ (CPI) ప్రధాన కార్యదర్శి డి. రాజా తీవ్రంగా స్పందించారు. కాగా నలుగురు మైనర్ బాలురు గంజాయి మత్తులో యువకుడిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తమిళనాడు రాష్ట్రం ఇలాంటి దాడులకు ఏ మాత్రం పేరుగాంచినది కాదని, అక్కడ దశాబ్దాలుగా వలస కార్మికులు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, తాజాగా జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో మారుతున్న సామాజిక వాతావరణానికి అద్దం పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తమిళనాడులో అన్ని మతాల వారు, వివిధ ప్రాంతాల వారు శాంతియుతంగా కలిసి ఉండటం అక్కడి సంస్కృతి అని, కానీ ఇటీవల RSS, సంఘ్ పరివార్ సంస్థలు సృష్టించిన ద్వేషపూరిత వాతావరణం వల్లే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆ మైనర్లు కూడా ప్రభావితమై ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఇలాంటి దాడులు జరగడం అత్యంత విచారకరమని పేర్కొన్న రాజా, ఈ కేసుపై ప్రభుత్వం లోతైన విచారణ జరపాలని కోరారు. తమిళనాడు ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో చాలా సున్నితంగా, కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Next Story