- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CVC: 7,072 అవినీతి కేసులు పెండింగ్.. సీవీసీ షాకింగ్ రిపోర్ట్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేసిన 7,072 అవినీతి కేసులు పెండింగ్ లో ఉన్నాయని సీవీసీ నివేదికలో వెల్లడైంది.

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేసిన 7,072 అవినీతి కేసులు దేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని, వాటిలో 379 కేసులు 20 ఏళ్లకు పైగా విచారణలో ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) వార్షిక నివేదికలో వెల్లడైంది. 2024 డిసెంబర్ 31నాటికి మొత్తం కేసుల్లో 1,506 కేసులు మూడేళ్ల లోపు, 791 కేసులు మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య, 2,115 కేసులు ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల మధ్య పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. మొత్తం 2,281 కేసులు 10 నుంచి 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. మరో 379 కేసులు రెండు దశాబ్దాలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది.
హైకోర్టులు, సుప్రీంకోర్టులలో అప్పీళ్ల పెండింగ్‌ను సీవీసీ నివేదిక వెల్లడించింది. సీబీఐ లేదా నిందితులు దాఖలు చేసిన మొత్తం 13,100 అప్పీళ్లు, సవరణలు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 606 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉండగా, మరో 1,227 15 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్నాయి. మిగిలిన కేసులు వివిధ కాలపరిమితుల్లో ఉండగా.. 10 నుంచి15 ఏళ్లకు 2,989, 5-10 సంవత్సరాలకు 4,059, 2 నుంచి 5 ఏళ్లకు1,778, రెండేళ్ల లోపు 2,441 కేసులు ఉన్నాయి.
2024లో 644 కేసుల్లో తీర్పులు వెలువడగా వీటిలో 392 కేసుల్లో దోషులుగా తేలగా.. 154 మంది నిర్దోషులుగా విడుదలయ్యారు. 2023లో 71.47 శాతంగా ఉన్న శిక్షా రేటు గతేడాది 69.14 శాతంగా ఉంది. 2024లో సీబీఐ 807 కేసులను నమోదు చేయగా, వాటిలో 674 సాధారణ కేసులు,133 ప్రాథమిక విచారణలు ఉన్నాయి. వీటిలో 111 కేసులను కోర్టు ఆదేశాలపై స్వీకరించగా, 61 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సూచనల ఆధారంగా విచారణకు స్వీకరించింది.






