- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
China: మద్యం, సిగరేట్లు తగ్గించుకోండి.. అధికారులకు చైనా ప్రభుత్వం కఠిన ఆదేశాలు
అధికారులు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని చైనా ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారం నేపథ్యంలో అధికారులు దుబారా ఖర్చులు (wasteful spendings) తగ్గించాలని చైనా (China) ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వంలోని అధికారులు ఖర్చులు తగ్గించుకోవాలని ముఖ్యంగా ప్రయాణాలు, మద్యం సిగరేట్, ఆహారం, కార్యాలయాల అద్దెలు తగ్గించుకోవాలని జిన్ పింగ్ ప్రభుత్వం ఆదేశించింది. దుబారా సిగ్గుచేటు, పొదుపు వైభం అనే నినాదాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. చైనాలో ఆర్థిక సవాళ్లు, స్థానిక ప్రభు్తవాల రుణాల భారం పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఈ కఠిన నిబంధనలు జారీ చేసింది. ప్రస్తుతం భూముల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయింది. స్థానిక ప్రభుత్వాలు తీవ్రమైన రుణ సమస్యతో సతమతం అవుతున్నాయి. దీంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకుఈ పొదుపు చర్యలకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొంది. 2023 చివర్లో కూడా కేంద్ర అధికారులు పొదుపు మంత్రాన్ని పాటించాలని చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.






