- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIDEO: షోరూమ్ ముందే ఓలా వాహనానికి నిప్పంటించిన కస్టమర్
by Ajay Maddhiboyina |
స్కూటీ రిపేర్ కోసం వెళితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన కస్టమర్ ఆ షోరూం ముందే దానికి నిప్పంటించాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పాలన్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి షోరూంలో కొంతకాలం క్రితం ఓలా స్కటీని కొనుగోలు చేశాడు.

X
దిశ, వెబ్ డెస్క్: స్కూటీ రిపేర్ కోసం వెళితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహించిన కస్టమర్ ఆ షోరూం ముందే దానికి నిప్పంటించాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పాలన్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి షోరూంలో కొంతకాలం క్రితం ఓలా స్కటీని కొనుగోలు చేశాడు. కాగా అతడు తన భార్య, కుమారుడితో కలిసి స్కూటీపై షాపింగ్ కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా దాని హ్యాండిల్ రాడ్ విరిగిపోయింది.
దాంతో కుటుంబ సభ్యులను వేరే వాహనంలో ఇంటికి పంపి స్కూటీని నేరుగా ఓలా షోరూంకు తీసుకువెళ్లాడు. రిపేర్ కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించగా సరిగ్గా స్పందించలేదు. తీవ్ర అసహనానికి గురై స్కూటీకి షోరూం ముందే నిప్పంటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. వీడియో
Next Story






