కొన్ని దేశాలకు సీమాంతర ఉగ్రవాదం ఓ పాలసీ.. రాజ్‌నాథ్ సింగ్ హాట్ కమెంట్స్

by Kema Shiva Kumar |

కొన్ని దేశాలకు క్రాస్ బార్డర్ టెర్రరిజం (Cross-border terrorism) ఓ పాలసీగా మారిందని భాతర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

కొన్ని దేశాలకు సీమాంతర ఉగ్రవాదం ఓ పాలసీ.. రాజ్‌నాథ్ సింగ్ హాట్ కమెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్ని దేశాలకు క్రాస్ బార్డర్ టెర్రరిజం (Cross-border terrorism) ఓ పాలసీగా మారిందని భాతర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ చైనాలో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organization) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొన్నా. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దాయాది పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే దేశాలు ఎన్నటికీ అభివృద్ధి బాటపట్టలేవని అన్నారు. పాక్ లక్ష్యంగా చేసుకుని కొన్ని దేశాలు సరిహద్దు ఉగ్రవాదాన్ని విధాన సాధనంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపించారు. ఆ దేశం బాహాటంగానే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పింస్తుందని ఫైర్ అయ్యారు. అలాంటి దేశాలను NOC ముక్తకంఠంతో విమర్శించడానికి వెనుకాడకూడదని అన్నారు.

పహల్గామ్ టెర్రర్ అటాక్ చేసింది తామేనని లష్కర్-ఏ-తొయిబా (Lashkar-e-Taiba) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుందని సమావేశంలో ప్రస్తావించారు. ఈ దాడిలో 26 మంది టూరిస్టులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అందరిని మతాలను తెలుసుకుని ఉగ్రమూకలు కాల్పులకు తెగబడ్డాయని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే హక్కును వినియోగించుకుంటూ, సరిహద్దు ఉగ్రదాడులను నిరోధించడానికి భాతర్ మే 7న ‘ఆపరేషన్ సిందూర్‌’ను విజయవంతంగా ప్రారంభించిందని అన్నారు. సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశామని పేర్కొన్నారు. ఉగ్రవాదం, రాష్ట్రేతర శక్తులు, ఉగ్రవాద సమూహాల చేతుల్లో సామూహిక విధ్వంస ఆయుధాల వ్యాప్తితో శాంతి, శ్రేయస్సు సహజీవనం చేయలేవని కామెంట్ చేశారు. దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడటానికి SCO సభ్యదేశాలైన భారత్, కజకిస్తాన్, చైనా, కిర్గిజ్స్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్ ఐక్యంగా ఉండాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.

Next Story