ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కాంగ్రెస్ ఇంకా కోలుకోలేదు.. బిహార్ లో మోడీ ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2025-11-02 11:27:58  IST  )

కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి సీఎం పోస్టును ఆర్జేడీ లాగేసుకుందని ప్రదాని మోడీ ఆరోపించారు

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కాంగ్రెస్ ఇంకా కోలుకోలేదు.. బిహార్ లో మోడీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టి సీఎం పోస్టును ఆర్జేడీ లాగేసుకుందని ప్రధాని (Narendra Modi) మోడీ ఆరోపించారు. సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ ఉండాలని కాంగ్రెస్ ఏన్నడూ కోరుకోలేదని కానీ ఆ అవకాసాన్ని ఆర్జేడీ ఎన్నడూ కోల్పోలేదన్నారు. ఇవాళ బిహార్ ఎన్నికల (Bihar elections) ప్రచారంలో పాల్గొన్న మోడీ కాంగ్రెస్, ఆర్జేడీపై నిప్పులు చెరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ నేను అంతర్గతంగా జరిగిన విషయం మీతో పంచుకుంటాను. నామినేషన్ల ఉపసంహరణ గడవుకు ఒక రోజు ముందు బిహార్ లో మూసిన తలుపుల వెనుక దొంగాట సాగిందనని చెపపారు. తుపాకీ పట్టుకుని కాంగ్రెస్ నుంచి ఆర్జేడీ ముఖ్యమంత్రి పదవిని దొంగిలించిందని, తమను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకిటించమని కాంగ్రెస్ పై ఆర్జేడీ బలవంతం చేసిందని ఆరోపించారు. ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన గొడవలు ఉన్నాయని, మేనిఫెస్టోపై కాంగ్రెస్ ను ఆర్జేడీ సంప్రదించనే లేదని ఆరోపించారు. ఎన్నికలకు ముందే పరస్పరం ఇంత ద్వేశం ఉంటే ఆ తర్వాత ఒకరి తలలు మరొకరు బద్దలు కొట్టుకుంటారని ఇలాంటి వ్యక్తులు బిహార్ అభివృద్ధి కోసం పని చేయగలరా అని ప్రశ్నించారు. లాలూ ప్రసాద్ యాదవ్ పాలనను అడవి రాజ్యం అని అభివర్ణించారు.

ఇక ఆపరేషన్ సిందూర్ విజయవంతం తర్వాద యావత్ దేశం గర్వపడింది కానీ కాంగ్రెస్ దాని మిత్రపక్షమైన ఆర్జేడీ ఇష్టపడలేదని పీఎం ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ లో పాకిస్థాన్ లో పేలుళ్లు జరిగాయి కానీ కాంగ్రెస్ రాజకుటుంబం నిద్రలేని రాత్రులు గడుపుతోందనన్నారు. ఆపరేషన్ సిందూర్ షాక్ నుం పాకిస్థాన్, కాంగ్రెస్ నామ్‍దార్లు, దాని మిత్రపక్షమైన ఆర్జేడీ ఇంకా కోలుకోలేదని ధ్వజమెత్తారు.

Next Story