- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crime : రూ.60 చోరీ.. 27 ఏళ్ల తర్వాత వ్యక్తి అరెస్ట్
by Sathputhe Rajesh |
రూ.60 చోరీ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు 27 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : రూ.60 చోరీ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు 27 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో శివకాశికి చెందిన 55 ఏళ్ల పన్నీర్ సెల్వంను మధురై పోలీసులు అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ సూర కుమార్ నేతృత్వంలో స్పెషల్ టీమ్ పాత పెండింగ్ కేసులను ట్రాక్ చేసే పనిలో పడింది. స్పెషల్ పోలీసు విభాగానికి చెందిన సంతనపాండ్యాన్ టీం నిందితుడిని పట్టుకుంది. తెప్పాకులం పోలీసు స్టేషన్ పరిధిలో పన్నీర్ సెల్వం ఓ బాధితుడి వద్ద నుంచి రూ.60 చోరీ చేసి పరారయ్యాడు. విచారణ సందర్భంగా పన్నీర్ సెల్వం శివకాశిలో నివసిస్తున్నట్లు తేలింది. పెళ్లి చేసుకున్న అతడు ప్రస్తుతం తన కుటుంబంతో జీవిస్తున్నాడు. పోలీసులు అతడిని ట్రేస్ చేసి 27 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు.
Next Story






