Crash: అహ్మదాబాద్ విమానం ప్రమాదం.. ఈ నెల 11లోపు దర్యాప్తు నివేదిక !

by B.Srinivas |

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కమిటీ నివేదిక ఈ నెల 11 నాటికి విడుదలయ్యే అవకాశమున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Crash: అహ్మదాబాద్ విమానం ప్రమాదం.. ఈ నెల 11లోపు దర్యాప్తు నివేదిక !
X

దిశ, నేషనల్ బ్యూరో: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు కమిటీ నివేదిక ఈ నెల 11 నాటికి విడుదలయ్యే అవకాశమున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. నాలుగు నుంచి ఐదు పేజీలతో కూడిన ఈ నివేదికలో పలు కీలక వివరాలు ఉండనున్నట్టు తెలుస్తోంది. దీనిలో బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం, సిబ్బంది, అహ్మదాబాద్ విమానాశ్రయంలో పరిస్థితులు, విమానం టేకాఫ్ అయిన దాదాపు 30 సెకన్ల తర్వాత వాతావరణం గురించి వివరాలు ఉంటాయని వర్గాలు తెలిపాయి. అంతేగాక దర్యాప్తులో భాగంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలను కూడా వివరించనుంది. అయితే పూర్తి దర్యాప్తు నివేదిక రెండు నెలల్లో రానున్నట్టు సమాచారం. కాగా, గత నెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 275 మంది మరణించారు.

Next Story