- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌ను ఖండించిన CPI.. అరెస్ట్ చేయకుండా ఎన్‌కౌంటర్‌లు ఏంటని ఫైర్
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్(Encounter)ను భారత కమ్యూనిస్టు పార్టీ(CPI) జాతీయ నాయకత్వం ఖండించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్(Encounter)ను భారత కమ్యూనిస్టు పార్టీ(CPI) జాతీయ నాయకత్వం ఖండించింది. తక్షణమే ఈ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా(D.Raja) ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులను అరెస్ట్ చేయకుండా హత్య చేయడం అప్రజాస్వామికం అన్నారు. మావోయిస్టులు, ఆదివాసీల హత్యలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. చట్ట విరుద్ధ చర్యలకు ఈ ఎన్‌కౌంటర్ మరో ఉదాహరణ అని అన్నారు. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు (70) అలియాస్ బసవరాజు గురించి సమాచారం ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
నేరుగా ఎన్‌కౌంటర్ చేయడం ఏంటని మండిపడ్డారు. ఈ తరహా దూకుడు పెహల్గాం ఉగ్రవాదులను పట్టుకోవడంలో ఎందుకు చూపించడం లేదని సీరియస్ అయ్యారు. కాగా, ఇవాళ జరిగిన ఎన్‌కౌంటర్‌లో 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ధృవీకరించారు. ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. ఆపరేషన్‌లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నా. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.






