15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం.. హాజరైన పలువురు ప్రముఖులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-12 05:36:55  IST  )

భారత 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ఇవాళ రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు.

15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం.. హాజరైన పలువురు ప్రముఖులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ఇవాళ ఉదయం సరిగ్గా 10.11 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా జాతీయ గీతాలాపన చేసిన తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంతులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్, తాజా మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఇతర ఎన్డీఏ పక్ష నేతలు హాజరయ్యారు. అదేవిధంగా విపక్షం నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి సభ్యులు ఈ కార్యక్రామానికి అటెండ్ అయ్యారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ పక్ష నేతలు అభినందలు తెలిపారు.

కాగా, ఉప రాష్ట్రపతి (Vice President) ఎన్నికకు ఈ నెల 9న జరిగిన పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌, ప్రత్యర్థి ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే, రాధాకృష్ణన్ ఎన్నిక ఖాయం అవ్వడంతో గురువారం ఆయన మహారాష్ట్ర గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. అయితే, మహారాష్ట్ర బాధ్యతలను గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌కు రాష్ట్రపతి ముర్ము కట్టబెడుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.

Next Story