భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. సుదర్శన్ రెడ్డిపై ఘన విజయం

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-09 14:32:34  IST  )

భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. సుదర్శన్ రెడ్డిపై ఘన విజయం
X

దిశ, వెబ్‌‌‌డెస్క్: భారత 15వ ఉప రాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుసామి రాధాకృష్ణన్ (CP Radha Krishnan) ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అయితే, ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు తొలి ప్రాధాన్యతలోనే 452 ఓట్లు వచ్చాయి. ఇక ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మొదటి ఫస్ట్ ప్రియారిటీగా 300 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. దీంతో సీపీ రాధాకృష్ణ భారత ఉప రాష్ట్రపతిగా ఎన్నికైనట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో 98.4 శాతం పోలింగ్ నమోదు కాగా.. మొత్తం 15 ఓట్లు చెల్లనివిగా ఎన్నికల అధికారులు గుర్తించారు. ఉభయ సభలు కలుపుకుని మొత్తం ఓటర్ల సంఖ్య 781 ఉండగా.. 767 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 13 మంది ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. అందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు నలుగురు, బీజేడీకి చెందిన ఎంపీలు ఏడుగురు, అకాళీదల్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ సభ్యుడు మరొకరు ఉన్నారు.

Next Story