- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Covid: కొవిడ్ తీవ్రమైన విపత్తు.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిశ, నేషనల్ బ్యూరో: కొవిడ్-19 (Covid 19) మహమ్మారి మునుపెన్నడూ చూడని తీవ్రమైన విపత్తు అని, ఈ టైంలో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేక మంది ప్రజల ప్రాణాలను కాపాడిందని కేంద్ర ప్రభుత్వం (Union government) సుప్రీంకోర్టు (Supreme court)కు తెలియజేసింది. కొవిడ్ వ్యాక్సిన్ కారణంగా ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ వారి తల్లిదండ్రులు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ విక్రమ్ నాథ్ (vikramnath), జస్టిస్ పీవీ వరాలే (pv varale)లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యబాటి (Ishwarya bati) వాదనలు వినిపించారు. కొవిడ్ ఒక అపూర్వమైన విపత్తు అని, దానికి సంబంధించిన టీకా అనేక మంది ప్రాణాలను రక్షించిందని తెలిపారు. ఈ ప్రక్రియపై పటిష్టమైన యంత్రాగాన్ని కలిగి ఉన్నామని, దీని ద్వారానే మొత్తం ప్రక్రియను పర్యవేక్షించామని చెప్పారు. కొవిడ్ వ్యాక్సినేషన్ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం సమగ్రంగా పరిశీలించి, ఏఈఎఫ్‌ఐ అంశంతో వ్యవహరించే తీర్పును వెలువరించిందని తెలిపారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గోన్సాల్వేస్ వాదించారు. వ్యాక్సినేషన్ తర్వాత పిటిషనర్లు ఇద్దరూ తమ కుమార్తెలను కోల్పోయారని తెలిపారు. ఈ పిటిషన్‌పై 2022 ఆగస్టులో సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసు జారీ చేసిందని, ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్ రికార్డులో ఉందని చెప్పారు. వ్యాక్సిన్ వల్ల కలిగే దుష్ఫలితాలు, వాటి చికిత్సపై ప్రభుత్వం సమాచారం అందించాలని డిమాండ్ చేశారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రమాదకరం కాబట్టి ఐరోపా దేశాలు దాని వినియోగాన్ని నిషేధించాయని గుర్తు చేశారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. దరఖాస్తు కాపీని మూడు రోజుల్లోగా కేంద్రం తరపు న్యాయవాదికి ఇవ్వాలని గోన్సాల్వేస్‌కు సూచించింది. ఆ తర్వాత మొత్తం కేసును విచారిస్తామని తెలిపింది. ఈ పిటిషన్‌పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.