ఢిల్లీ లిక్క‌ర్ కేసులో కీల‌క తీర్పు..కేజ్రీవాల్, సిసోడియాకు కోర్టు క్లీన్‌చిట్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-27 05:56:59  IST  )

లిక్క‌ర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కేజ్రీవాల్ తో పాటు మాజీ మంత్రి సిసోడియాకు సైతం కోర్టులో ఊర‌ట ల‌భించింది.

ఢిల్లీ లిక్క‌ర్ కేసులో కీల‌క తీర్పు..కేజ్రీవాల్, సిసోడియాకు కోర్టు క్లీన్‌చిట్
X

దిశ, వెబ్ డెస్క్: లిక్క‌ర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కేజ్రీవాల్‌తో పాటు మాజీ మంత్రి సిసోడియాకు సైతం కోర్టులో ఊర‌ట ల‌భించింది. సీబీఐ చార్జిషీట్‌‌లో మెరిట్ లేద‌ని రౌస్ అవెన్యూ కోర్టు వెల్ల‌డించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు ఎలా పెడ‌తార‌ని ప్ర‌శ్నించింది. సీబీఐపై కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ కేసును కొట్టేసింది. కోర్టు తీర్పు అనంతరం కేజ్రీవాల్, సిసోడియో భావోద్వేగానికి లోనయ్యారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ తప్పు చేయలేదు, తప్పుడు కేసులు పెట్టారని అన్నారు.

తాను సిసోడియా సహా తమ పార్టీ నేతలు అంతా నిజాయితీపరులు అని చెప్పారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిపై పోరాడి ఎన్నికల్లో గెలవాలని కానీ ఇలా కాదని అన్నారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ కోసమేనని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. తప్పుడు కేసులో జైలుకు పంపించారని ఆరు నెలల పాటు జైలులో ఉంచారని కన్నీళ్లు పెట్టుకున్నారు. తనపై ఎన్నో కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బిగ్ రిలీఫ్.. క్లీన్‌చిట్ ఇచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు

Next Story