కారుపైకి ఎక్కి ప్రియురాలితో సరసాలు.. కట్ చేస్తే.. చుక్కలు చూపించిన పోలీసులు

by Muthe.Rajitha |

పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా యువత నడిరోడ్డు మీద బైక్ లతో, కార్లతో స్టంట్స్ వేయడం మాత్రం మానడం లేదు.

కారుపైకి ఎక్కి ప్రియురాలితో సరసాలు.. కట్ చేస్తే.. చుక్కలు చూపించిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా యువత నడిరోడ్డు మీద బైక్ లతో, కార్లతో స్టంట్స్ వేయడం మాత్రం మానడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఓ వ్యక్తి కారు రూఫ్ మీదికి ఎక్కి విన్యాసాలు చేసిన ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. ఢిల్లీలోని సాకేత్ జే బ్లాక్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్డుపై ఓ వ్యక్తి తన కారు పైకి ఎక్కి విన్యాసాలు చేస్తూ ప్రియురాలికి ముద్దు పెడుతూ రొమాన్స్ చేసాడు. రోడ్డు మీద వెళ్లేవారు ఇబ్బంది పెడతారన్న కామన్ సెన్స్ కూడా లేకుండా విన్యాసాలతో రెచ్చి పోయాడు.

అయితే వెనుక ఉన్న మరో కారులోని ఓ వ్యక్తి ఈ ఘటనను సోషల్ మీడియాలో షేర్ చేయగా వీడియో వైరల్ అయ్యింది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. అయితే ఈ వీడియోపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. వారిని అరెస్ట్ చేసి, జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసారు.

Next Story