- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Uttarakhand: చలిమంట వేసుకుని పడుకున్నారు.. తెల్లారే చూస్తే..!
ఉత్తరాఖండ్(Uttarakhand ) రాష్ట్రంలో చలిమంట వేసుని గదిలో నిద్రపోయిన దంపతులు తెల్లారేసరికి విగతజీవులుగా మారారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్(Uttarakhand ) రాష్ట్రంలో చలిమంట వేసుని గదిలో నిద్రపోయిన దంపతులు తెల్లారేసరికి విగతజీవులుగా మారారు. గురువారం రాత్రి భిలంగనా(Bhilangana area) ప్రాంతంలోని ధ్వారా థాప్లా గ్రామంలో చలిమంట వల్ల ఊపిరాడక దంపతులు చనిపోయారు. మదన్ మోహన్ సెమ్వాల్ (52), అతని భార్య యశోద దేవి (48) ఒక వివాహ వేడుకలో పాల్గొనడానికి ద్వారి-థప్లా గ్రామానికి(Dwari-Thapla village) వచ్చారు. అయితే, గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో, చలి కారణంగా వారు ఒక పొయ్యిని వెలిగించి దాన్ని తమ గదిలోకి తీసుకెళ్లి, తలుపులు మూసి నిద్రపోయారు. శుక్రవారం ఉదయం వారి కుమారుడు దంపతులను నిద్రలేపడానికి వెళ్ళేసరికి.. ఎవరూ తలుపు తెరవలేదు. దీంతో, తలుపు పగలగొట్టి చూడగా.. దంపతులిద్దరూ విగతజీవులుగా కన్పించారని స్థానికులు చెప్పారు. చలి మంట తర్వాత ప్రమాదకర వాయువు వెలువడటంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే, ఈ ఘటనపై కుటుంబలసభ్యులు గానీ, స్థానికులు గానీ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. వెంటనే, దంపతులకు అంత్యక్రియలు నిర్వహించినట్లు స్థానికులు తెలిపారు.






