హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా.. ప్రేమజంట అరెస్ట్

by Naga Rani Yarlagadda |

హాస్టల్ బాత్రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టిన కేసులో ప్రేమజంట అరెస్టైంది. తమిళనాడులో కృష్ణగిరి జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా.. ప్రేమజంట అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: హాస్టల్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టిన కేసులో ఓ ప్రేమజంట అరెస్టైంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా ఉత్తనప్పల్లి సమీపంలో లాలిక్కల్ గ్రామంలో ప్రైవేట్ ఉమెన్స్ పీజీలో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ కేసులో ఒడిశాకు చెందిన నీలుకుమారి గుప్తా (22), పంజాబ్ కు చెందిన ప్రియుడు రవిప్రతాప్ సింగ్ (29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ గూండా చట్టం కింద అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీ తంగదురై కలెక్టరుకు సిఫారసు చేశారు. ఈ మేరకు కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అరెస్ట్ చేసిన రవిప్రతాప్ ను సేలం సెంట్రల్ జైలుకి, నీలుకుమారి గుప్తాను కోవై మహిళా జైలుకు తరలించారు.

Next Story