దేశంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: మల్లికార్జున ఖర్గె

by Dishanational1 |
దేశంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: మల్లికార్జున ఖర్గె
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హామీలు 2004లో ఇండియా షైనింగ్ నినాదం తరహాలో మిగిలిపోయాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గె అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టోను ఆమోదించేందుకు జరిగిన పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో మల్లికార్జున ఖర్గె ప్రసంగిస్తూ.. పార్టీ మేనిఫెస్టోలో లేవనెత్తిన ప్రతి అంశాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ దేశంలోని ప్రతి గ్రామం, పట్టణం, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని కోరారు. ఈ బాధ్యత మనందరిపై ఉందన్నారు. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తప్పనిసరిగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర వారా ప్రజల వాస్తవ సమస్యలను రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి ప్రజల దృష్టికి తెసుకెళ్లడాన్ని ప్రశంసించారు. ఇవి కేవలం రాజకీయ యాత్రలు మాత్రమే కాదు, మన రాజకీయ చరిత్రలో అతిపెద్ద ప్రజా ఉద్యమంగా గుర్తించబడతాయి. మన కాలంలో ఎవరూ ఇంత భారీ కసరత్తు చేయలేదనే వాస్తవాన్ని ఎవరూ మరువలేరు. ఈ రెండు యాత్రలు కూడా అనేక సమస్యలను పరిష్కరించగలిగాయి. మల్లికార్జున ఖర్గె అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, ప్రియాంకా గాంధీ పి చిదంబరం, దిగివ్జయ్ సింగ్ సహా ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని కీలక విషయాలను చిదంబరం చదివి వినిపించారు. మేనిఫెస్టోలో ప్రధానంగా ఐదు న్యాయ హామీలను తీసుకొచ్చారు. భగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ హామీల గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాహుల్ గాంధీ ప్రకటించారు.


Next Story

Most Viewed