Coromandel express accident : కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ : రక్తదానం చేసేందుకు బారులు తీరిన యువత

by Rajesh |
Coromandel express accident : కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ : రక్తదానం చేసేందుకు బారులు తీరిన యువత
X

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణ మృదంగం మోగించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందగా 900 మందికి గాయాలయ్యాయి. అయితే వీరిలో చాలా మంది బోగీల్లో ఇరుక్కుపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని అధికారులు భావిస్తున్నారు. ఒడిశా ప్రభుత్వం శనివారం సంతాపదినంగా ప్రకటించింది. కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్‌లో గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు యువత భనగా, సోరో ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే యువత రక్త దానం చేసేందుకు తరలిరావడంతో నెటిజన్లు వారి గొప్ప మనసుకు ఫిదా అవుతున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆర్మీ కల్నల్ ఎస్కే దత్తా మాట్లాడుతూ.. ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. మరికొంత మంది ఆర్మీ సిబ్బందిని కోల్ కతా నుంచి రప్పిస్తున్నామన్నారు. రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మొత్తం 200 అంబులెన్సులు, 45 మొబైల్ హెల్త్ టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయన్నారు. 50 మంది డాక్టర్లు సహాయక చర్యల్లో భాగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు.

Also Read...

కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ : ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే (వీడియో)

Next Story

Most Viewed