- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Student Luxury Farewells : పాఠశాల వీడ్కోలు పార్టీకి లగ్జరీ కార్లతో కాన్వాయ్...పోలీసుల ఎంట్రీ !
సంపన్నుల పిల్లలంటే ఆ మాత్రం ఉండదా అనునుకున్నారో ఏమోగాని గుజరాత్ రాష్ట్రం సూరత్ జహంగీర్‌పురా ప్రాంతంలోని ఓ పాఠశాల వీడ్కోలు పార్టీకి(School Students) విద్యార్ధులు ఖరీదైన, విలాసవంతమైన కార్ల కాన్వాయ్(Convoy of luxury cars )తో వచ్చి హల్ చల్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : సంపన్నుల పిల్లలంటే ఆ మాత్రం ఉండదా అనునుకున్నారో ఏమోగాని గుజరాత్ రాష్ట్రం సూరత్ జహంగీర్‌పురా ప్రాంతంలోని ఓ పాఠశాల వీడ్కోలు పార్టీకి(School Students) విద్యార్ధులు ఖరీదైన, విలాసవంతమైన కార్ల కాన్వాయ్(Convoy of luxury cars )తో వచ్చి హల్ చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral video)గా మారింది. బీఎమ్‌డబ్ల్యుఎం, మెర్సిడెస్ బెంజ్, రోల్డ్స్ రాయల్ సహా విలాసవంతమైన 30 కార్లలో పాఠశాల వీడ్కోలు పార్టీకి విద్యార్ధులు ర్యాలీగా వచ్చారు.
విద్యార్థులు తమ కార్ల సన్‌రూఫ్‌ల నుండి బయటకు వచ్చి నిలబడటం, పైగా చేతిల్లో టాయ్ గన్స్ పట్టుకుని గట్టిగా కేకలు వేస్తూ విన్యాసాలు చేస్తూ, బాణాసంఛ పేలుస్తూ హంగామా సృష్టించారు. విద్యార్థులు ఏరియల్ షాట్‌లను తీయడానికి గ్రౌండ్ లెవల్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించారు. రీల్స్(Reels)కోసం విద్యార్ధులు లగ్జరీ కార్లతో ర్యాలీ చేశారని సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా..విద్యార్థుల ర్యాలీ ట్రాఫిక్, రవాణా చట్టాలన్నింటిని ఉల్లంఘించడమేనంటూ పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. విషయం పోలీసు శాఖ వరకు చేరడంతో వారు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అనితా వనాని లగ్జరీ కార్ల యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారణ చేపట్టినట్లుగా తెలిపారు.
విచారణ పూర్తయ్యాక విద్యార్థులకు ఈ వాహనాలు సరఫరా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సామాజిక మాధ్యమాల కోసం విద్యార్థులు ఇటువంటి వీడియోలను సృష్టించడం విద్యార్థుల్లో పెరుగుతున్న పెడ ధోరణికి నిదర్శనమన్నారు. ఇలాంటి చర్యలతో విద్యార్ధుల భద్రతతో పాటు రహదారిపై ఇతరులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఎవరైనా ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించినట్లు లేదా ప్రజా భద్రతకు హాని కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. అయితే పాఠశాల నిర్వహకుల కథనం మేరకు ఎలాంటి అనుమతులు లేకుంగానే తల్లిదండ్రులు, విద్యార్థులు కార్లను తీసుకొచ్చి ర్యాలీలో పాల్గొన్నారన్నారు. పాఠశాల బస్సును మాత్రమే పంపిందని..అయితే దానిని వారు ఉపయోగించలేదని...వారు వచ్చిన లగ్జరీ కార్ల కాన్వాయ్ ని క్యాంపస్‌లోకి అనుమతించలేదని వారు తెలిపారు.






