- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం గని వద్ద నరమేధం.. 70 మంది కాల్చివేత
దక్షిణ సూడాన్ రాజధాని జుబా సమీపంలోని బంగారు గని వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 70 మందికి పైగా మరణించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బంగారు గని (Gold Mine) వద్ద చోటుచేసుకున్న వివాదం రక్తపాతానికి దారితీసింది. దక్షిణ సూడాన్ (South Sudan) రాజధాని శివారులోని సెంట్రల్ ఈక్వటోరియాలోని 'జెబెల్ ఇరాక్' (Jebel Iraq) అనే బంగారు గని వద్ద గుర్తు తెలియని సాయుధ దుండగులు జరిపిన మెరుపు దాడిలో 70 మందికి పైగా మరణించారు. ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా అక్రమ మైనింగ్ చేస్తున్నవారికి, మైనింగ్ కంపెనీలకు మధ్య తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే వారాంతంలో సాయుధులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మరణాలు సంభవించగా చాలా మంది గాయపడినట్లు పోలీస్ ప్రతినిధి క్వాసిజ్వోక్ డొమినిక్ వెల్లడించారు. ఘటనకు సంబంధించిన భీతావహ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డజన్ల కొద్దీ మృతదేహాలు మైదానంలో పడి ఉండటం వీడియోల్లో కనిపిస్తోంది. దాడి సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా మంది సమీపంలోని అడవుల్లోకి పారిపోయినట్లు స్థానిక జర్నలిస్టులు చెబుతున్నారు. ఈ నరమేధాన్ని విపక్ష పార్టీ SPLM/A-IO తీవ్రంగా ఖండించింది. ఈ దాడి వెనుక ప్రభుత్వ దళాల హస్తం ఉందని ఆరోపించింది.
.






