- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Los Angeles: లాస్ ఎంజెల్స్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన కఠిన వలస విధానాలపై దేశవ్యాప్తంగా నిరసనల పర్వం కొనసాగుతోంది . ముఖ్యంగా లాస్ ఏంజెల్స్ నగరంలో నాలుగో రోజు ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. పరిస్థితిని నియంత్రించేందుకు 700 మంది మిలటరీ మరిన్స్‌ను తాత్కాలికంగా మోహరించనున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన కఠిన వలస విధానాలపై దేశవ్యాప్తంగా నిరసనల పర్వం కొనసాగుతోంది . ముఖ్యంగా లాస్ ఏంజెల్స్ నగరంలో నాలుగో రోజు ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. పరిస్థితిని నియంత్రించేందుకు 700 మంది మిలటరీ మరిన్స్‌ను తాత్కాలికంగా మోహరించనున్నట్లు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గ్రౌండ్‌లో ఉన్న నేషనల్ గార్డ్ బలగాలకు మద్దతుగా ఈ మిలటరీ మోహరింపు జరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 2,000 మంది నేషనల్ గార్డ్ సిబ్బందిని పంపాలని ఆదేశించారు. దీంతో మొత్తం నగరంలో 4 వేల మంది నేషనల్ గార్డ్స్ ఆందోళనల్ని అడ్డుకునే పనిలో ఉన్నారు. ఇన్‌సరెక్షన్ యాక్ట్ (Insurrection Act) ను ఇప్పటివరకు అమలులోకి తీసుకురాలేదు. ఆ చట్టం అమలయితే మిలటరీ సైన్యం నేరుగా పోలీసు విధుల్లో పాల్గొనగలదు.
ట్రంప్ అహంకారంతోనే అంతా..
కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది ప్రజల భద్రత కోసం కాదు. అధ్యక్షుడి గర్వాన్ని తృప్తిపర్చే చర్య అన్నారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా ట్రంప్ ప్రభుత్వంపై కేసు దాఖలు చేశారు. ఇది రాష్ట్రాధికారంపై దాడి చట్టవిరుద్ధమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. వలసదారులపై పెద్దఎత్తున దాడులు, వేగవంతమైన డిపోర్టేషన్ చర్యలు తీసుకోవడంపై ప్రజలు వీధుల్లోకి వచ్చారు. మిలటరీ మోహరింపుతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మేము గార్డ్‌ను పంపకపోతే నగరం పూర్తిగా నాశనమయ్యేది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.






