అమెజాన్ పై కేసు పెట్టిన యువకుడు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

by Malleboina Mahesh |   (  Updated:2025-10-22 12:35:36  IST  )

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో దేశవ్యాప్తంగా అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా దసరా, దీపావళి పండుగ సందర్భంగా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ పెద్ద మొత్తంలో ఆఫర్లను తీసుకొచ్చాయి.

అమెజాన్ పై కేసు పెట్టిన యువకుడు.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో దేశవ్యాప్తంగా అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా దసరా, దీపావళి పండుగ సందర్భంగా ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్స్ (Online shopping platforms) పెద్ద మొత్తంలో ఆఫర్లను తీసుకొచ్చాయి. దీంతో కోట్లాది మంది భారతీయులు అత్యధికంగా ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మింత్ర, జియే వంటి అనేక ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫామ్‌లలో కొనుగోళ్లు చేశారు. అయితే గతంలో ఎన్నడు లేని విధంగా ఈ పండుగ సీజన్‌లలో ఆన్ లైన్ కష్టమర్లకు (Online customers) ఉహించని షాక్ లు తగిలాయి. తాము ఆర్డర్ చేసిన వస్తువలకు బదులు ఇతర వస్తువులు, చీప్ క్వాలిటీ వస్తువులు పెద్ద మొత్తంలో రావడం సంచలనంగా మారింది. ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకోగా.. అమెజాన్ (Amazon) పై నాన్ బెయిలబుల్ వారెంట్ (Non-bailable warrant) జారీ అయింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వీరేష్ అనే వ్యక్తి.. అమెజాన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లో రూ.80 వేలు చెల్లించి ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus) ఆర్డర్ పెట్టాడు. అయితే అతనికి ఐఫోన్ 15 ప్లస్ కు బదులుగా ఐక్యూ ఫోన్ (IQ Phone) డెలివరీ చేసిన చేశారు. దీంతో షాక్ తిన్న వీరేష్.. అనేక సార్లు కస్టమర్ కేర్ తో మాట్లాడాడు. అయినప్పటికి అమెజాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో అతడు తన వద్ద ఉన్న ఆధారాలతో కన్స్యూమర్ ఫోరం (Consumer Forum)ను ఆశ్రయించాడు. దీంతో అతని ఫిర్యాదుపై విచారణ జరిపిన కన్స్యూమర్ వెంటనే బాధితుడికి ఐఫోన్ డెలివరీ చేయని పక్షంలో రూ.80 వేలు రీఫండ్‌తో పాటు రూ.25 వేలు జరిమానా చెల్లించాలని అమెజాన్‌కు ఆదేశాలు ఇచ్చింది. అయితే కన్స్యూమర్ ఫోరం ఆదేశాలను అమెజాన్ సంస్థ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కన్స్యూమర్ ఫోరం అమెజాన్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి తదుపరి విచారణను నవంబర్ 21 కి వాయిదా వేసింది. దీంతో ఈ ఇష్యూపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Next Story