ఎస్ఐ ఇంట్లో కానిస్టేబుల్ గలీజ్ పని.. యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి

by Prasad Jukanti |

యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసిన కానిస్టేబుల్‌‍ను అరెస్టు చేశారు.

ఎస్ఐ ఇంట్లో కానిస్టేబుల్ గలీజ్ పని.. యువతి స్నానం చేస్తుండగా వీడియో తీసి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలను టార్గెట్‍గా చేసుకుని నీచపు పనులు చేస్తున్న కేటుగాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. సమాజంలో పైకి హుందాతనంగా కొనసాగుతూ అవకాశం రాగానే నీచ బుద్ధి ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఎస్ఐ ఇంట్లో ఓ కానిస్టేబుల్ చేసిన గలీజ్ పని కలకలం రేపింది. యువతి స్నానం చేస్తుండగా సదరు కానిస్టేబుల్ వీడియో తీసి అడ్డంగా బుక్కయ్యాడు. తమిళనాడులోని కోయంబత్తూరు (Coimbatore) జిల్లా పొళ్లాచ్చి తాలూకా పోలీస్ స్టేషన్‍లో పని చేస్తున్న ఇన్ స్పెక్టర్ వద్ద మాధవకణ్ణన్ అనే కానిస్టేబుల్ (Constable) కారు డ్రైవర్‍గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎస్ఐ కుటుంబంతో మాధవకణ్ణన్ కు కాస్త చనువు కూడా పెరిగింది. ఈ క్రమంలో ఇన్ స్పెక్టర్ తన కుమార్తెలను చూసుకునేందుకు తమ బంధువైన ఓ యువతిని ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఇటీవల రెండు రోజుల పాటు ఎస్ఐ ఇంటికి వెళ్లలేదు. భద్రత కోసం డ్రైవర్ మాధవకణ్ణన్ ను పంపించాడు. ఇదే అదునుగా భావించిన మాధవ కణ్ణన్ ఇన్ స్పెక్టర్ బంధువైన యువతి స్నానం చేస్తుండగా తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ఇది గమనించిన సదరు యువతి విషయాన్ని ఎస్ఐకి చెప్పడంతో మాధఝవకణ్ణన్ నీచపు బుద్ధి వెలుగులోకి వచ్చింది. ఇన్ స్పెక్టర్ ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్‍ను అరెస్టు చేశారు.

Next Story