వివాహేతర సంబంధం.. కుటుంబాన్నే అంతం చేయాలని కుట్ర?

by Disha Web |
వివాహేతర సంబంధం.. కుటుంబాన్నే అంతం చేయాలని కుట్ర?
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకరితో ఒకరు జీవితంతం బతకాల్సిన భార్యభర్తలు అక్రమ సంబంధాలకు అలవాటు పడి ప్రాణాలనే తీసుకుంటున్నారు. వివాహేతర సంబంధంతో అందమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది అయితే రక్తం పంచుకున్న బంధాలను సైతం తెంచుకుంటున్నారు. అలాంటి ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడ్డ యువతి తన భర్త, అత్త, మరిది అడ్డుగా ఉన్నారని భావించి ఏకంగా వారి ప్రాణాలకు ఎసరు పెట్టింది. అందుకు ఆమె ఇద్దరు కూతుళ్లు సహకరం తీసుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. గౌతమ్‌ బుద్ధనగర్‌ జిల్లాలోని తానా థన్‌కర్‌ ఏరియా జునైద్‌పుర్‌ గ్రామానికి చెందిన దేవేంద్ర, రాజ్‌కుమారి ఇద్దరు దంపతులు. కాగా వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన అభిషేక్‌తో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. అయితే, తమ సంబంధానికి భర్త దేవేందర్‌, అతని తల్లి, తమ్ముడు అడ్డుగా ఉన్నారని ఇద్దరు భావించి కుటుంబాన్ని చంపటానికి ప్లాన్‌ చేశారు.

ప్లాన్ ప్రకారం తన కూతుళ్ల సాయంతో.. వారు తినే అన్నంలో విషం కలిపి ముగ్గురికి పెట్టారు. దేవేందర్‌, అతడి తల్లి, తమ్ముడు విషం పెట్టిన ఆహరం తినడంతో స్ప్రహ కోల్పోయారు. దీంతో ప్రియుడితో కలిసి తల్లికూతుళ్లు అక్కడి నుండి పరారయ్యారు. ముగ్గురు స్ప్రహ కోల్పోయి పడి ఉండడం చూసిన పక్కింటి వారు ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హత్యల కుట్రకు పాల్పడ్డ నలుగుర్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Next Story