భారత్‌లో ఉగ్రదాడికి కుట్రలు.. పాక్‌ దౌత్యవేత్తకు NIA కోర్టు నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-11 07:11:55  IST  )

పాకిస్తానీ దౌత్యవేత్త అమిర్ జుబైర్ సిద్దిఖీ (Amir Zubair Siddiqui)కి చెన్నై ఎన్ఐఏ కోర్టు (NIA Court)నోటీసులు జారీ చేసింది.

భారత్‌లో ఉగ్రదాడికి కుట్రలు.. పాక్‌ దౌత్యవేత్తకు NIA కోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తానీ దౌత్యవేత్త అమిర్ జుబైర్ సిద్దిఖీ (Amir Zubair Siddiqui)కి చెన్నై ఎన్ఐఏ కోర్టు (NIA Court)నోటీసులు జారీ చేసింది. భారత్‌లో ఉగ్రదాడులు చేయాలని ప్లాన్ చేసిన నేపథ్యంలో ఆయనకు నోటీసులు అందాయి. ఈ మేరకు అక్టోబర్ 15న చెన్నైలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కోర్టు ఎదుట అక్టోబర్ 15న హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. కాగా, పాకిస్తానీ దౌత్యవేత్త అమిర్ జుబైర్ సిద్దిఖీ ఇండియా మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో చేరాడు. అతడు 2014లో శ్రీలంక (Srilanka)లోని పాకిస్తాన్ హై కమిషన్‌లో వీసా కౌన్సెలర్‌గా పనిచేస్తున్న సమయంలో 26/11 శైలిలో భారత్‌లో దాడులు చేయాలని కుట్ర పన్నినట్లుగా ఎన్ఐఏ ఆరోపిస్తోంది. సిద్దిఖీ సౌతిండియాలోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్‌లపై దాడులు చేయాలని కుట్ర పన్నినట్లు భారత దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. దీంతో భారత్ తొలిసారి ఓ పాకిస్తానీ దౌత్యవేత్త పేరును వాంటెడ్ లిస్ట్‌లో చేర్చింది.

జాకిర్ హుస్సేన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ మేరకు..

ఎన్‌ఐఏ ఫిబ్రవరిలో దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం.. చెన్నై (Chennai)లోని అమెరికా కాన్సులేట్, బెంగళూరులోని ఇజ్రాయెల్ కాన్సులేట్, విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్, దేశవ్యాప్తంగా ఉన్న పోర్టులు ఉగ్రవాద హిట్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ కేసు, 2013లో తమిళనాడు పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) చేత మొహమ్మద్ జాకిర్ హుస్సేన్ (Zakir Hussain) అరెస్ట్‌కు సంబంధించింది. అతడు పాకిస్తాన్ కోసం గూఢచర్యంలో చేస్తుండగా అరెస్ట్ అయ్యాడు. జాకిర్ హుస్సేన్ విచారణలో భాగంగా తాను కొలంబోలోని పాకిస్తాన్ కాన్సులేట్ అధికారి అమిర్ జుబైర్ సిద్దిఖీ కోసం పనిచేస్తున్నట్లుగా వాంగ్మూలం ఇచ్చాడు. హుస్సేన్ కొలంబోలో సిద్దిఖీని కొన్నిసార్లు కలవడం, రక్షణ స్థావరాల గురించి సమాచారం సేకరించడం, భారత సైన్యానికి ఆయుధాల కదలికలు, ఇద్దరు పాకిస్తానీ జాతీయుల కోసం నకిలీ పాస్‌పోర్టులు, వీసాలను ఏర్పాటు చేయడం లాంటి పనులు చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. అయితతే, ఎన్‌ఐఏ బృందం ఈ కేసులో దర్యాప్తు కోసం శ్రీలంకకు కూడా వెళ్లి విచారణ చేపట్టింది. అప్పటి నుంచి పాకిస్తానీ దౌత్యవేత్త అమిర్ జుబైర్ సిద్దిఖీ భారత్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో నిలిచాడు.

Read More..

మోస్ట్ వాంటెడ్ ఆర్థిక నేరగాన్ని అదుపులోకి తీసుకున్న సీబీఐ

Next Story