- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi elections: ఢిల్లీ ఎన్నికలు.. ఐదు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections) జరగనున్నాయి. కాగా.. రాజకీయ పార్టీలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections) జరగనున్నాయి. కాగా.. రాజకీయ పార్టీలన్నీ ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ (Congress) ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ బుధవారం ఈ మ్యానిఫెస్టోను (Congress manifesto) విడుదల చేశారు. ఆ తర్వాత జైరాం రమేశ్ మాట్లాడారు. ‘ఢిల్లీ ప్రజల కోసం ఐదు గ్యారెంటీలు ప్రకటించాం. గ్యారెంటీ అంటే పౌరుల హక్కు అని అర్థం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ కాలుష్యాన్ని కట్టడిచేయలేకపోతున్నాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంతో విఫలమయ్యాయి’ అని జైరాం రమేశ్ విమర్శించారు. ఇక, ఢిల్లీలోని పూర్వంచల్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ దేవేంద్ర యాదవ్ కీలక హామీ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని, పూర్వాంచల్ వాళ్ల కోసం ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేస్తామని తెలిపారు.
మేనిఫెస్టోలో ఏముందంటే?
ఢిల్లీ ప్రజలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌తో పాటు ప్యారీ దీదీ పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థికసాయం కాంగ్రెస్ ప్రకటించింది. ‘అందరికీ ఆరోగ్యం’ పథకం కింద రూ.25లక్షల వరకు ఆరోగ్య బీమా అందిస్తామని హామీ ఇచ్చింది. మెహంగై ముక్తి యోజన కింద సిలిండర్‌కు రూ.500 చొప్పున వంటగ్యాస్, ఉచిత రేషన్ కిట్.. సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, నిరుపేదలకు నెలకు రూ.5వేల చొప్పున పెన్షన్ ఇస్తామంది. యువత కోసం ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగంలో ఒక ఏడాది పాటు అప్రెంటీస్‌షిప్ తో సహా నెలకు రూ.8,500 స్టైఫండ్ ఇస్తామని ప్రకటించింది.






