"వోట్ చోరీ"పై రేపు కాంగ్రెస్ భారీ సభ

by Muthe.Rajitha |

బీజేపీ "వోట్ చోరీ" అంశంపై రేపు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో భారీ సభ నిర్వహించనుంది.

వోట్ చోరీపై రేపు కాంగ్రెస్ భారీ సభ
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ "వోట్ చోరీ" అంశంపై రేపు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో భారీ సభ నిర్వహించనుంది. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగే ఈ నిరసన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోసహా కాంగ్రెస్ కీలక నేతలంతా హాజరు కానున్నారు. వోట్ చోరీ అంశంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా 5.5 కోట్ల సంతకాలు సేకరించామని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రేపు జరగనున్న సభ అనంతరం సంతకాలతో కూడిన మెమోరాండంను సమర్పించేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలవనున్నట్టు వెల్లడించారు. కాగా ఇటీవల కాలంలో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ వోట్ చోరీకి పాల్పడిందని రాహుల్ గాంధీ ఆధారాలతో సహా బయట పెట్టడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.

Next Story