Delhi Election: ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా

by S Gopi |

ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా హామీ కల్పించనున్నట్టు ప్రకటించింది.

Delhi Election: ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఒకరోజు తర్వాత, ప్రధాన కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు కీలక వాగ్దానం చేసింది. తాము అధికారంలోకి వస్తే 'జీవన్ రక్షా యోజన' కింద ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా హామీ కల్పించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పథకాన్ని ప్రారంభిస్తూ.. ఈ పథకం కుటుంబానికి సమగ్రమైన ఆరోగ్య కవరేజీని అందిస్తుంది. తీవ్రమైన అనారోగ్యాలతో పాటు ఆసుపత్రిలో చేరడం, చికిత్స కోసం వైద్య ఖర్చులను అందిస్తుంది. ఈ పథకాన్ని రాజస్థాన్‌లో తమ హయాంలో అమలు చేశామని అశోక్ గహ్లోత్ ప్రస్తావించారు. ఎటువంటి షరతులు లేకుండా జీవన్ రక్షా యోజన పథకాన్ని అమలు చేశామని, ఢీలీలోనూ ఇది ఒక గేమ్‌ఛేంజర్ అవుతుందన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు పెరుగుతున్నాయని, ఇది దేశానికి కూడా అవసరమని తాను నమ్ముతున్నట్టు పథకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన అన్నారు. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story