ప్రశ్నిస్తే పాకిస్తాన్‌కు సపోర్ట్ చేసినట్లా?.. కేంద్రంపై ఖర్గే ఫైర్

by Gantepaka Srikanth |

ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రశ్నిస్తే పాకిస్తాన్‌కు సపోర్ట్ చేసినట్లా?.. కేంద్రంపై ఖర్గే ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor)పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడితే.. అనుమానాలు వ్యక్తం చేస్తే.. విపక్షాలు పాకిస్తాన్‌(Pakistan)కు మద్దతు ఇస్తున్నాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదని మండిపడ్డారు. కేంద్రం వైఫల్యాలను ప్రశ్నిస్తే.. పాకిస్తాన్‌కు సపోర్ట్ చేసినట్లేనా? అని సీరియస్ అయ్యారు. అసత్య ప్రచారాలతో ప్రజలను ఎక్కువ కాలం మభ్యపెట్టలేరు అని అన్నారు. తాము ఏనాడూ పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వలేదు.. ఇవ్వబోము కూడా అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చాలా చరిత్ర ఉందని గుర్తుచేశారు. తాము దేశాన్నే నిర్మించామని కీలక వ్యాఖ్యలు చేశారు. పెహల్గాం ఉగ్రదాడిని ప్రపంచం మొత్తం చూసిందని.. కాంగ్రెస్ కంటే ముందు తామే.. సైన్యంలో ధైర్యం నింపే ప్రయత్నం చేశామని అన్నారు.

Next Story