అసెంబ్లీ ముందు గ్యాస్ సిలిండర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ధర్నా

by Dishafeatures2 |
అసెంబ్లీ ముందు గ్యాస్ సిలిండర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ధర్నా
X

దిశ, వెబ్ డెస్క్: పెరిగిన గ్యాస్ ధరలను నిరిసిస్తూ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గ్యాస్ సిలిండర్లతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. విపరీతంగా గ్యాస్ ధరలు పెరగడంతో మహిళలు ఇబ్బందిపడుతున్నారని, కట్టెల పొయ్యే గతి అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేకుటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

కాగా తాజాగా ఢిల్లీలో గ్యాస్ ధరలను పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై రూ.50, కమెర్షియల్ సిలిండర్ పై రూ. 350 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో డొమెస్టిక్ సిలిండ్ ధర రూ.1.118.50, కమెర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,268కి పెరిగింది.


Next Story

Most Viewed