కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజైన్: రామందిరం విషయంలో పార్టీ వైఖరిపై అసంతృప్తి

by Dishanational2 |
కాంగ్రెస్ ఎమ్మెల్యే రిజైన్: రామందిరం విషయంలో పార్టీ వైఖరిపై అసంతృప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవలే మహారాష్ట్రలో సీనియర్ నేత మిలింద్ డియోరా పార్టీకి రిజైన్ చేయగా..తాజాగా గుజరాత్‌లోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీజే చావ్డా తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ శంకర్ చౌదరికి శనివారం రిజైన్ లెటర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘25ఏళ్లుగా కాంగ్రెస్‌లో పనిచేశాను. రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకతో దేశమంతా ఆనందంగా ఉంది. కానీ ప్రజల సంతోషంలోభాగం కాకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. అందుకే అసంతృప్తితో రిజైన్ చేస్తున్నా’ అని చెప్పారు. ‘ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల విధానాలకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. కాగా, విజాపూర్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చావ్డా..బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. చావ్డా రాజీనామాతో గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 15కి చేరనుంది.

Next Story

Most Viewed