- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: మీడియా సమావేశంలో ఆర్ఎస్ఎస్ గీతాలాపన చేసిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగనాథ్
ఆయన బాటలోనే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రంగనాథ్ కూడా ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడం చర్చనీయాశమైంది.

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అసెంబ్లీలో చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటపై జరిగిన చర్చలో ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆయన బాటలోనే మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రంగనాథ్ కూడా ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడం చర్చనీయాశమైంది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడంలో తప్పేంటని అభిప్రాయపడ్డారు. తుమకూరు జిల్లాలోని కునిగల్‌లో విలేకరులతో మాట్లాడటానికి ముందు ఆర్ఎస్ఎస్ గీతాం 'నమస్తే సదా వత్సల' ప్రారంభ పంక్తులను పాడారు. ఈ గీతం చాలా మంచి పాట అని అభివర్ణిస్తూనే, డిప్యూటీ సీఎం అసెంబ్లీలో పాడినపుడే తాను కూడా దాన్ని విన్నానని అన్నారు. దాని అర్థం తెలుసుకున్నానని, జన్మభూమికి వందనం చేయాలనే అర్థం ఉంది. అందులో నాకెలాంటి తప్పు కనిపించడం లేదు. కాంగ్రెస్ లౌకిక పార్టీ, ఇతరుల నుంచి మంచిని స్వీకరిస్తాం. కానీ, మత రాజకీయాలను వ్యతిరేకిస్తూనే ఉంటుందన్నారు. ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇదే సమయంలో బీజేపీపై విమర్శలు చేసిన రంగనాథ్.. కులాలు, మతాల పేరు మీద రాజకీయాలు చేస్తోందని, అందుకు తాము వ్యతిరేకిస్తామని అన్నారు. బీజేపీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ సిద్ధాంతాలు ఎన్నటికీ కలవవు. కానీ ఎవరైనా ఆర్ఎస్ఎస్‌కు చెందిన పాట పాడితే తప్పేంటి? అనే ప్రశ్న మాత్రమే అడుగుతున్నానని పేర్కొన్నారు.






