- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సొంత పార్టీని టార్గెట్ చేసిన దిగ్విజయ్.. మోడీని ప్రశంసిస్తూ సంచలన ట్వీట్
సొంత పార్టీని టార్గెట్ చేసిన దిగ్విజయ్.. మోడీని ప్రశంసిస్తూ సంచలన ట్వీట్

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్టు పెట్టారు. కాంగ్రెస్‌కు బద్ధ శత్రువైన ఆర్ఎస్‌ఎస్‌ను ప్రశంసించారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ (LK Advani) కుర్చీలో కూర్చొని ఉండగా.. ఆయన ముందు నేలపై ప్రధాని మోడీ కూర్చుకున్నారు. దీంతో నేలపై కూర్చొన్న వ్యక్తి దేశానికి ప్రధానిగా అయ్యారంటూ మోడీ (PM Modi)ని ఉద్దేశిస్తూ దిగ్విజయ్ కొనియాడారు. ‘నేను ఓ ఫొటో చూశాను. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌లో సామాన్య కార్యకర్తలా.. నాయకుల పాదాల వద్ద నేలపై కూర్చొన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా ఎలా ఎదిగారో చూడండి. ఇది ఆ సంస్థ శక్తి’ అని రాసుకొచ్చారు. ఈ పోస్టుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. 1996లో గుజరాత్ సీఎంగా శంకర్ సింఘ్ వాఘేలా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆ ఫోటో తీసినట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకత్వ లోపాలను పరోక్షంగా దిగ్విజయ్ ప్రశ్నించారని నెట్టింట చర్చ జరుతోంది.






