- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బలవంతపు హగ్! మహిళా ఎమ్మెల్యే పట్ల కాంగ్రెస్ నేత అసభ్య ప్రవర్తన! వైరల్
కేరళలో ఓ కాంగ్రెస్ నాయకుడు మహిళా ఎమ్మెల్యే పట్ల బహిరంగంగా వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళలో ఓ కాంగ్రెస్ నాయకుడు మహిళా ఎమ్మెల్యే పట్ల బహిరంగంగా వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. కొల్లం నూతన ఎమ్మెల్యే (MLA) బిందు కృష్ణ పట్ల కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్ ప్రవర్తించిన తీరు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, తీవ్ర విమర్శలకు దారి తీసింది. వైరల్ వీడియో ప్రకారం.. తిరువనంతపురంలోని కేపీసీసీ (KPCC) ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొనేందుకు బిందు కృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేత చెరియన్ ఫిలిప్‌కు ఆమె కరచాలనం (షేక్ హ్యాండ్) చేసేందుకు చేయి కలిపారు. అయితే, చెరియన్ ఫిలిప్ మాత్రం ఆమెను బలవంతంగా ఆలింగనం (హగ్) చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురైన బిందు కృష్ణ, వద్దని వారిస్తూ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె స్పష్టంగా అయిష్టత వ్యక్తం చేసినప్పటికీ, చెరియన్ ఫిలిప్ మళ్లీ ఆమె చేతులను బలంగా పట్టుకుని హత్తుకునేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన బిందు కృష్ణ, అతడి చేతులను విడిపించుకుని అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు.
నెట్టింట వెల్లువెత్తుతున్న విమర్శలు
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు, మహిళా హక్కుల కార్యకర్తలు చెరియన్ ఫిలిప్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక ప్రజా ప్రతినిధి, పైగా మహిళ స్పష్టంగా ‘వద్దు’ అని చెబుతున్నా, బహిరంగ ప్రదేశంలో ఆమె అనుమతి లేకుండా బలవంతంగా మీద పడటం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మహిళల పట్ల కనీస గౌరవం, మర్యాద లేకుండా ప్రవర్తించిన అతడి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.






