కాంగ్రెస్ నేతలూ.. సమాధానం చెప్పండి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

by Disha Web Desk 1 |
కాంగ్రెస్ నేతలూ.. సమాధానం చెప్పండి: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ
X

దిశ, వెబ్ డెస్క్: అదానీ అంశంపై నిత్యం కాంగ్రెస్ పార్టీ తన నిరసనను కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మంగళవారం రాహుల్ గాంధీపై మండిపడ్డారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో ఉన్న 2009 చిత్రాన్ని మీడియాకు చూపించారు. వాద్రా అదానీతో చేతులు పట్టుకుని ఎందుకు కనిపించాడంటూ స్మృతి ఇరానీ సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో రోజు పార్లమెంట్ సమావేశాలకు భంగం కలిగిస్తున్న కాంగ్రెస్ ఉద్దండులు ఇందుకు సమాధానం చెప్పాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఫైరయ్యారు.


Next Story

Most Viewed