దేశ భూమిలో.. దేశ జెండాలో నా కుటుంబ రక్తం ఉంది: ప్రియాంక గాంధీ

by Disha Web Desk 19 |
దేశ భూమిలో.. దేశ జెండాలో నా కుటుంబ రక్తం ఉంది: ప్రియాంక గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ భూమిలో.. దేశ జెండాలో నా కుటుంబం రక్తం ఉందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయటాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని రాజఘాట్ వద్ద కాంగ్రెస్ తలపెట్టిన సంకల్ప్ సత్యాగ్రహా దీక్షకు ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబం సిగ్గుపడాలా అని ప్రశ్నించారు. ఈ దేశం కోసం నా కుటుంబం రక్తం దారబోసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన దేశ ప్రజలు నమ్మరని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదని.. నియంత పాలన నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story