‘మేమంతా మీవెంటే ఉన్నాం’.. కేంద్రానికి మరోసారి గుర్తుచేసిన కాంగ్రెస్

by Gantepaka Srikanth |

ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) నేడు భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పహల్గామ్‌ ఉగ్రదాడి మృతులకు సీడబ్ల్యూసీ సంతాపం తెలిపింది.

‘మేమంతా మీవెంటే ఉన్నాం’.. కేంద్రానికి మరోసారి గుర్తుచేసిన కాంగ్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (CWC) నేడు భేటీ అయ్యింది. ఈ సమావేశంలో పహల్గామ్‌ ఉగ్రదాడి మృతులకు సీడబ్ల్యూసీ సంతాపం తెలిపింది. ఉగ్రదాడిపై న్యాయం కోసం దేశం ఎదురుచూస్తోందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. ఇది రాజకీయాలకు సమయం కాదని.. ఉగ్రదాడి నిందితులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. బాధిత కుటుంబాలకు పరిహారం మాత్రమే కాదు.. దీర్ఘకాలిక పునరావాసం, మానసిక మద్దతు కల్పించాలని CWC డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ.. ఉగ్రదాడి (Terrorist Attack) జరిగి రోజులు గడుస్తున్నా ప్రభుత్వం వద్ద నిర్దిష్టమైన వ్యూహం ఏమీ కనిపించడం లేదని అన్నారు. దీనిపై విపక్షాలు మొత్తం కేంద్రంతోనే ఉన్నాయని మరోసారి గుర్తుచేశారు. దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ఉగ్రదాడిలో మరణించిన బాధిత కుటుంబీకులను రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పరామర్శించారని, వారికి అమరుల హోదా కల్పించాలని కోరినట్లు చెప్పారు. కులగణనపై తమ డిమాండును ప్రభుత్వం అంగీకరించిందని, ప్రకటించిన సమయం మాత్రం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు.

Next Story