- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం.. KPCC చీఫ్‌గా BK హరిప్రసాద్ నియామకం
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత బీకే హరిప్రసాద్ నియమితులయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక కాంగ్రెస్‌లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) నూతన అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు బీకే హరిప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇవాళ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ నియామకాన్ని చేపట్టారని, ఇది తక్షణమే అమలులోకి వస్తుందని ఆ ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు. కాగా, ఇప్పటి వరకు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా సేవలు అందించిన డీకే శివకుమార్ స్థానంలో హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పార్టీకి డీకే అందించిన విశేష సేవలను, ఆయన చేసిన కృషిని కాంగ్రెస్ అధిష్టానం కొనియాడింది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Next Story






