యుద్ధంపై 23 సార్లు ట్రంప్ ప్రకటన.. మోడీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-17 12:08:34  IST  )

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతోంది.

యుద్ధంపై 23 సార్లు ట్రంప్ ప్రకటన.. మోడీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 21వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిద్ధమవుతోంది. భారత్ - పాక్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 23 సార్లు పునరుద్ఘాటించడంపై ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) పార్లమెంట్ సాక్షిగా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిన వీడియోను జైరాం రమేష్ (Jairam Ramesh) రీ పోస్ట్ చేశారు.

"అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 66 రోజుల్లో 23 సార్లు భారతదేశం - పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను తీసుకువచ్చానని, ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)ను నిలిపివేసానని పునరావృతం చేశారు. వాణిజ్యం గురించి మాట్లాడటం ద్వారా నేను ఈ యుద్ధాన్ని ఆపానని కూడా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, ఇది ఒక ముప్పు కూడా. అమెరికా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. దీని కోసం ఆ దేశాలపై ఒత్తిడి కూడా తెస్తుంది. అంతర్జాతీయ ఒప్పందాలకు ఒక ప్రక్రియ ఉంది, కానీ ఇక్కడ ప్రతిదీ ఏకపక్షంగా జరుగుతోంది, ఇది వింతగా ఉంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అవసరాన్ని డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు, కానీ ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై మౌనంగా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ తో తాను ఏమి చర్చించానో, ఏ ఒప్పందాలు చర్చిస్తున్నాయో, అది మన దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో నరేంద్ర మోదీ దేశానికి చెప్పాలని మేము కోరుకుంటున్నాము." అని ఆ పోస్టులో కాంగ్రెస్ రాసుకొచ్చింది. కాంగ్రెస్ డిమాండ్ పై ప్రధాని నరేంద్రమోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story