- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా గాంధీ భవన్’.. ప్రారంభించిన సోనియా గాంధీ
ఢిల్లీలోని 9ఏ కోట్లా రోడ్‌లో నిర్మించిన కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా గాంధీ భవన్’ను ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రారంభించారు.

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని 9ఏ కోట్లా రోడ్‌లో నిర్మించిన కాంగ్రెస్ కొత్త కార్యాలయం ‘ఇందిరా గాంధీ భవన్’ (Indira gandhi Bavan)ను ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Malli karjun karge), ఎంపీ రాహుల్ గాంధీ (Rahul gandhi), ఇతర పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం సోనియా గాంధీ రిబ్బన్ కట్ చేసి ఆఫీసులో అడుగుపెట్టారు. దీంతో 46 ఏళ్ల తర్వాత పార్టీ అడ్రస్ మారింది. అంతకుముందు అక్బర్ రోడ్డు నంబర్ 24లో ఉన్న ఓ భవనంలో పార్టీ కార్యాకలాపాలు నిర్వహించారు. అయితే ప్రభుత్వ బంగ్లాలో పార్టీ ఆఫీసులు ఉంకూడదని సుప్రీంకోర్టు ఆదేశించడంతో పార్టీలు సొంత కార్యాలయాలు నిర్మించుకున్నాయి.
కాగా, కొత్త కార్యాలయానికి 2009లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి రూ.252 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. కొత్త ఆఫీసులో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్వాగతోపన్యాసం చేశారు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో భవన నిర్మాణాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. భవన నిర్మాణాన్ని చేపట్టిన ఎల్‌అండ్‌టీ సంస్థ ప్రతినిధుల బృందానికి కృతజ్ఞతలు చెప్పారు.






