ఆ పార్టీలతో కలవొద్దు.. టీవీకేకి కాంగ్రెస్‌ కండిషన్స్

by Ajay Maddhiboyina |

ఇటీవ‌ల వ‌చ్చిన త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగ‌ర్ రాలేద‌న్న సంగ‌తి తెలిసిందే. దీంతో టీవీకేకు కాంగ్రెస్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజ‌య్‌కి తమ సపోర్ట్ ప్రకటించారు.

ఆ పార్టీలతో కలవొద్దు.. టీవీకేకి కాంగ్రెస్‌ కండిషన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవ‌ల వ‌చ్చిన త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాల్లో టీవీకే పార్టీకి మ్యాజిక్ ఫిగ‌ర్ రాలేద‌న్న సంగ‌తి తెలిసిందే. దీంతో టీవీకేకు కాంగ్రెస్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు విజ‌య్‌కి తమ సపోర్ట్ ప్రకటించారు. అయితే మద్దతు ఇచ్చేందుకు మొదట ఎలాంటి కండిషన్స్ పెట్టని కాంగ్రెస్ ఇప్పుడు ఓ షరతు పెట్టినట్టు తెలుస్తోంది. మ‌త‌త‌త్వ పార్టీల‌తో క‌ల‌వ‌ద్ద‌ని కాంగ్రెస్ టీవీకేకు స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం. మ‌రోవైపు సీఎం కూడా ష‌ర‌తుల‌తోనే మ‌ద్దతు ఇస్తున్న‌ట్టు పేర్కొంది. సీఎం అవ్వ‌డానికి మాత్ర‌మే త‌మ స‌పోర్ట్ అని సీపీఐ, సీపీఎం నిర్ణ‌యం తీసుకున్నాయి. అంతేకాకుండా కేబినెట్ లో చేర‌డం లేద‌ని కూడా స్ప‌ష్టం చేశాయి.

అయితే టీవీకేకు సపోర్ట్ చేస్తున్న మ‌రో పార్టీ వీసీకే విజ‌య్ గెలిచి రాజీనామా చేసేందుకు సిద్ధ‌మైన తిరుచ్చి ఈస్ట్ టికెట్ త‌మ‌కు కేటాయించాల‌ని ష‌ర‌తు పెట్టింది. వీసీకే పార్టీ అధినేత తిరుమావ‌ళ‌న్ తిరుచ్చి ఈస్ట్ నుండి పోటీచేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ కండిష‌న్స్ ఇప్పుడు విజ‌య్ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వామ‌ప‌క్షాలు ప్ర‌భుత్వ ఏర్పాటు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి కానీ రేపు పాల‌న స‌రిగ్గా లేక‌పోతే ప్ర‌తిప‌క్ష డీఎంకేతో క‌లిసి అసెంబ్లీలో విమ‌ర్శ‌లు కురిపించే ఛాన్స్ ఉంది. మ‌రోవైపు తిరుచ్చి ఈస్ట్ నుండి టీవీకే పోటీ చేయాల‌ని భావించ‌గా ఇప్పుడు ఆ టికెట్ ను వీసీకే ఆశిస్తోంది. ఇక ఇప్ప‌టికే టీవీకే బీజేపీకి బీ టీం అని అంటున్నారు. కానీ అటు కాంగ్రెస్ పార్టీ మ‌తత‌త్వ‌పార్టీల‌తో పొత్తులు పెట్టుకోవ‌ద్ద‌ని కండిష‌న్స పెట్టింది. ఇలాంటి ప‌రిస్థితుల్లో విజ‌య్ ఎన్నిరోజులు ప్ర‌భుత్వాన్ని న‌డుపుతారో అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి.

Next Story