- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశాన్ని తప్పుదోవ పట్టించారు.. మోడీ ప్రభుత్వంపై మండిపడ్డ ఖర్గే
‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో దేశాన్ని మోడీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని, ఇప్పుడే వాస్తవాలు బయటకు వస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’పై ప్రత్యేక పార్లమెంట్ సెషన్ నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి డిమాండ్ చేశారు. తాజాగా సింగపూర్ వేదికగా జరుగుతున్న షాంగ్రిలా డైలాగ్ సమయంలో భారత సీడీఎస్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలను ఖర్గే పునరుద్ఘాటించారు. ఆపరేషన్ ఆరంభంలో కొన్ని వ్యూహాత్మక పొరబాట్లు చేశామని, అయితే వాటిని వెంటనే సరిదిద్దుకొని రెండ్రోజుల్లోనే పాకిస్తాన్‌పై అన్ని యుద్ధ విమానాలను పంపించామని సీడీఎస్ చెప్పారు. ఇదే వ్యాఖ్యలను ఎత్తిచూపిన ఖర్గే.. సీడీఎస్ ఇంటర్వ్యూ తర్వాత కొన్ని కీలకమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. దీనికోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని, అప్పుడే ఈ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందన్నారు. దేశాన్ని మోడీ ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని, ఇప్పుడిప్పుడే యుద్ధం కమ్మిన మేఘాలు పక్కకు తప్పుకుంటున్నాయని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు అన్నారు.
‘శత్రువుతో పోరాడేందుకు మన వాయుసేన పైలట్లు ప్రాణాలు పణంగా పెడుతున్నారు. మనకు కొంత నష్టం జరిగినా పైలట్లు అందరూ భద్రంగానే ఉన్నారు’ అని సీడీఎస్ మాటలను ఖర్గే పునరుద్ఘాటించారు. ‘ఆ తర్వాత మా వ్యూహాలను సరిదిద్దుకొని మరోసారి పాకిస్తాన్‌పై దాడి చేసేందుకు అన్ని ఫైటర్ జెట్లను పంపించాం. పాక్ స్థావరాలను లాంగ్ రేంజ్ నుంచి టార్గెట్ చేశాం’ అని సీడీఎస్ చెప్పారు. ఈ మాటలను ప్రస్తావించిన ఖర్గే.. ‘భారత దళాల ధైర్యసాహసాలకు సెల్యూట్ చేస్తున్నాం. కానీ సంపూర్ణ వ్యూహాత్మక సమీక్ష ఇప్పుడు అత్యవసరం. డిఫెన్స్ ఎంత సిద్ధంగా ఉందనే విషయంపై పూర్తిస్థాయిలో సమీక్ష జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కార్గిల్ రివ్యూ కమిటీ వంటి నిపుణుల కమిటీని ఈ పని కోసం నియమించాలి’ అని ఖర్గే డిమాండ్ చేశారు.






