సంగ్మాకు మరో రెండు పార్టీల మద్దతు.. ఎన్పీపీ మద్దతు ఎంతకు చేరిందంటే..?

by Vinod kumar |

మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీకి మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది.

సంగ్మాకు మరో రెండు పార్టీల మద్దతు.. ఎన్పీపీ మద్దతు ఎంతకు చేరిందంటే..?
X

షిల్లాంగ్: మేఘాలయాలో నేషనల్ పీపుల్స్ పార్టీకి మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా మరో రెండు పార్టీలు మద్దతు ఇచ్చినట్లు ఎన్పీపీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు ఇది ఎన్పీపీకి ఇది మరి కాస్తా బలాన్ని చేకూర్చింది. మెత్బా లింగ్డాయ్ కు చెందిన యూనిటెడ్ డెమోక్రటిక్ పార్టీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ప్రకటించాయి. ఈ నిర్ణయాన్ని యూడీపీ చీఫ్ తెలిపారు. దీంతో ఎన్పీపీ మద్దతు కాస్తా 45 కు చేరింది. ఈ నెల 2న వెలువడిన ఫలితాల్లో యూడీపీ 11 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే.

మరోవైపు పీడీఎఫ్ కూడా 2 స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పటికే ఎన్పీపీకి బీజేపీతో పాటు స్థానిక పార్టీ హెచ్ఎస్ పీడీపీ కి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించారు. మరోవైపు ఎన్పీపీ 26 స్థానాల్లో గెలుపొంది అత్యధిక సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం సీఎంగా కాన్రడ సంగ్మా ప్రమాణం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని కూడా హజరుకానున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు బీజేపీ తరుఫున ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ లో చోటు కల్పించాలని డిమాండ్ వినిపిస్తోంది.

Next Story